AVS : తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ అలా మాట్లాడడం బాధనిపించిందని అప్పట్లోనే చెప్పిన ఏవీఎస్

AVS : జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటుడిగా మారారు కమెడియన్ ఏవీఎస్. బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం చిత్రం ఆయనకి మొదటిది.. తొలి సినిమాకే ఆయన నంది అవార్డును అందుకున్నారు. మొత్తం 19ఏళ్ల తన సినీ కెరీర్‌లో అయిదు వందలకి పైగా చిత్రాలలో నటించారు ఏవీఎస్. కమెడియన్‌గా కొనసాగుతున్నప్పుడే అంకుల్ సినిమాతో దర్శకుడిగా నిర్మాతగా మారారు ఏవీఎస్.
తరుణ్, పల్లవి మెయిన్ లీడ్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే సినిమా పోయిందన్న బాధ కన్నా, తరుణ్ తల్లిదండ్రులు అంకుల్ సినిమా గురించి చెడుగా మాట్లాడడం ఎక్కువబాధ కలిగించిందని ఏవీఎస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తరుణ్ తల్లిదండ్రుల్ని తనేదో మోసం చేశానని ఆరోపించారని అది బాధకలిగించిందని చెప్పుకొచ్చారు ఏవీఎస్.
అంకుల్ కథ వాళ్ళకి తాను చెప్పలేదని, సినిమా టైటిల్ ని ఏవీఎస్ చివర్లో పెట్టాడని అన్నారని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంకుల్ అనే టైటిల్ తోనే తన సినిమా స్టార్ట్ అయిందని దీనికి చిరంజీవి క్లాప్ కొట్టారని ఏవీఎస్ తెలిపారు. ఇక ఈ సినిమాకి అప్పట్లో యాబై లక్షలు పోగొట్టుకున్నానని తెలిపారు ఏవీఎస్. ఇక అంకుల్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాల గురించి ఏవీఎస్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముందుగా అప్పటికి ఏ ఇమేజ్ లేని హీరో తరుణ్ తో అంకుల్ సినిమా మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.
ఎనబై శాతం పూర్తి అయ్యాక తరుణ్ నువ్వేకావాలి సినిమా రిలీజ్ అవ్వడంతో తరుణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిందని, దీనితో ఆ ఇమేజ్ ని అంకుల్ సినిమా బ్యాలెన్స్ చేయలేకపోయిందని అన్నారు. కాగా అంకుల్ చిత్రానికి ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com