సోహైల్‌కు బంపర్‌ ఆఫర్‌.. బ్రహ్మనందం ఫోన్ చేసి ఏకంగా..

సోహైల్‌కు బంపర్‌ ఆఫర్‌.. బ్రహ్మనందం ఫోన్ చేసి ఏకంగా..
106 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 4 గత ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ లో అభిజీత్ విన్నర్ గా నిలవగా, అంతకుమించి విన్నర్ గా నిలిచాడు సోహైల్‌

106 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 4 గత ఆదివారంతో ముగిసింది. ఈ సీజన్ లో అభిజీత్ విన్నర్ గా నిలవగా, అంతకుమించి విన్నర్ గా నిలిచాడు సోహైల్‌. సీజన్ కి సెకండ్ రన్నరఫ్‌ అయినప్పటికీ విన్నర్ గెల్చుకున్నంత ఫ్రైజ్‌ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్‌ అందులో రూ.10 లక్షలు అనాథశ్రయాలకు ఇస్తానని చెప్పగా, వద్దు ఆ డబ్బు నేనే ఇస్తానని నాగార్జున చెప్పారు.

అందులో నుంచి ఐదు లక్షలు తన ఫ్రెండ్ మెహబూబ్‌కి ఇస్తానంటే, వద్దు నేనే మెహబూబ్‌కి పది లక్షలు ఇస్తానని ఫైనల్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి చెప్పారు. దీనితో సోహైల్ కి మనీతో పాటుగా పేరు కూడా వచ్చింది. వీటితో పాటుగా సోహైల్ చేయబోయే సినిమాలో తానూ గెస్ట్ రోల్ చేస్తానని చిరంజీవి చెప్పారు. దీనితో సోహైల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు సోహైల్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చింది.

అదేంటంటే టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మనందం సోహెల్ కి ఫోన్ చేసి నువ్వు చేయబోయే సినిమాలో ఒక్క రూపాయి రెమ్యునరేషన్ లేకుండా నటిస్తానని చెప్పినట్టుగా సోహైల్ స్వయంగా వెల్లడించాడు. " సోహైల్ నీ కోసమే బిగ్‌బాస్‌ చూశాను.. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తాను.. అలాగే నువ్వు తీయబోయే సినిమాలో రెమ్యునరేషన్ లేకుండా నటిస్తాను" అని బ్రహ్మనందం హామీ ఇచ్చినట్టుగా సోహైల్ చెప్పుకొచ్చాడు.

చిరు, నాగార్జునలతో పాటుగా బ్రహ్మనందం కూడా సోహైల్ కు తోడు నిలవడంతో సోహైల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story