Comedian Satya : సగం హిట్ సత్య వల్లే
టైమింగ్ ఉన్నోడికి టైమ్ వస్తే చెలరేగిపోతాడు అంటారు. అందుకు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులను ఉదాహరణగా చెప్పొచ్చు. ముఖ్యంగా కమెడియన్స్ కు ఇది బాగా వర్తిస్తుంది. నాటి రేలంగి, రాజబాబు నుంచి నేటి బ్రహ్మానందం వరకూ ఇది అప్లై అవుతుంది. అయితే బ్రహ్మీ దూకుడు తగ్గించాడు. ఈ గ్యాప్ లో వెన్నెల కిశోర్ బాగా పికప్ అయ్యాడు. అదే టైమ్ లో చాలామంది కమెడియన్స్ వచ్చారు కానీ.. ఎక్కువ కాలం కెరీర్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. వెన్నెల కిశోర్ మాత్రమే దశాబ్ధంకు పైగా టాప్ కమెడియన్ గా వెలుగుతున్నాడు. అతని తర్వాత ఎవరు అంటే ఇప్పటి జెనరేషన్ లో ఎవరూ కనిపించడం లేదు అనుకుంటోన్న టైమ్ లో నేనున్నా అంటూ ప్రతి సినిమాతోనూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు సత్య.
సత్య బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డిక్షన్ వైవిధ్యంగా ఉంటాయి. ఎలాంటి పాత్రలో అయినా బలే సెట్ అయిపోతాడు. కేవలం కామెడీ మాత్రమే కాక రంగస్థలం లాంటి సినిమాలో కన్నింగ్ క్యారెక్టర్ ను కూడా బాగా పండించాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘మత్తు వదలరా 2’ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ టాక్ లో మేజర్ షేర్ సత్యదే అంటే కాదనలేం. ఆ రేంజ్ లో చెలరేగిపోయాడు. నిజానికి ఫస్ట్ పార్ట్ విజయంలో కూడా అతనికి మేజర్ షేరే ఉంది. కానీ అది శ్రీ సింహాకు ఫస్ట్ మూవీ కావడంతో మొత్తం అతని ఎకౌంట్ లో పడింది. బట్ ఈ సారి అలా జరగలేదు. సత్య తన టైమింగ్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయే నవ్వులు పంచుతున్నాడు. రౌడీఫెలో లాంటి మూవీస్ లో కాస్త ఓవర్ ద బోర్డ్ అనిపించినా.. అప్పుడప్పుడూ సునిల్ ను ఇమిటేట్ చేస్తున్నాడు అనిపించినా.. అవన్నీ సరిదిద్దుకున్నాడు. కేవలం తనదైన ఒరిజినాలిటీని చూపిస్తున్నాడిప్పుడు. చాలా సినిమాల్లో అతని కామెడీయే హైలెట్ గా నిలిచింది. అంతెందుకు.. ఆ మధ్య వచ్చిన నాగ శౌర్య రంగబలిలో ఫస్ట్ హాఫ్ మొత్తం సత్య కామెడీ మీదే రన్ అయింది. సెకండ్ హాఫ్ లో కామెడీ లేదు.. సినిమా పోయింది.
మత్తు వదలరా 2 కు అతనికి బెస్ట్ కమెడియన్ గా అవార్డ్స్ కూడా వస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా వెన్నెల కిశోర్ ను కూడా డామినేట్ చేస్తూ దూకుడు చూపుతు్నన సత్య అతని తర్వాత ఎక్కువ కాలం కమెడియన్ గా రాణించే సత్తా ఉన్నవాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com