ఈవారం ఓటీటీ, థియేటర్స్‎లో సందడి చేయనున్న మూవీస్ ఇవే..!

ఈవారం ఓటీటీ, థియేటర్స్‎లో సందడి చేయనున్న మూవీస్ ఇవే..!
Tollywood: గత వారం ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఎంటో చూద్దాం.

క‌రోనా ప్రభావం సినీ ఇండ‌స్ట్రీపై తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్రభావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్రత్యామ్నయంగా క‌నిపించింది. థియేటర్లు మళ్లి తెరుచుకోవడంతో చిన్న సినిమాలు సందడి చేస్తున్నారు. గత వారం ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఎంటో చూద్దాం.

'రాజ రాజ చోర'.

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం 'రాజ రాజ చోర'. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చెప్పుకుంటూ తిరిగే ఓ దొంగ కథని ఈ మూవీలోచూపించనున్నారు. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లగా నటిస్తున్నారు. రవిబాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న థియేటర్స్ లో విడుదల కానుంది.

'క్రేజీ అంకుల్స్‌'

'క్రేజీ అంకుల్స్‌' సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రధానపాత్రలో కనిపిస్తుంది. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది.

'కనబడుటలేదు'

సునీల్‌ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కనబడుటలేదు'. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రేమకథ కూడా జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. రామ్ గోపాల్ వర్మకు చెందిన స్పార్క్ ఓటీటీలో ఇది విడుదల కానుంది.

'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌'

హాలీవుడ్ చిత్రాలను అభిమానించే వారి ఈ సారి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుంది 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' టీమ్. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన 8 మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక భారీ యాక్షన్ సీన్స్ తో 9వ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 19న ఇంగ్లీష్‌, హిందీ తెలుగుతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.

'బజార్‌ రౌడీ'

ఆగస్టు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సంపూర్ణేశ్‌ బాబు చిత్రం 'బజార్‌ రౌడీ'. 'హృదయకాలేయం', 'కొబ్బరిమట్ట' చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేశ్‌ బాబు. సంపూర్ణేశ్‌ హీరోగా వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మహేశ్వరి వద్ది నాయిక.

ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే

జీ 5

200 హల్లా హో (ఆగస్టు 20)

ఆల్ట్‌ బాలాజీ

కార్టెల్‌ (ఆగస్టు 20)

ఆహా

తరగతి గది దాటి (ఆగస్టు 20)

నెట్‌ఫ్లిక్స్‌

కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో (ఆగస్టు 20)

స్వీట్‌గర్ల్‌ (ఆగస్టు 21)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో

ఇవాన్‌ అల్మైటీ (ఆగస్టు 16)

ద స్కెలిటన్‌ ట్విన్స్‌ (ఆగస్టు 17)

నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (ఆగస్టు 18)

అన్నెట్టే (ఆగస్టు 20)

కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ (ఆగస్టు 20)

హోమ్‌ (ఆగస్టు 19)

Tags

Next Story