Celebrities Divorce: సైలెంట్‌గా ఉన్నా సమంతని ట్రోల్: నటి

Celebrities Divorce: సెలబ్రిటీల వివాహ వేడుకల కంటే విడాకుల విషయాలే హాట్ టాపిక్‌లుగా నిలుస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఏ వుడ్ అయినా నచ్చని మనిషితో నడిచేదెలా అని తెగతెంపులు చేసుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు ధనుష్, ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్థి పలికి ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కి గురిచేశారు. వాళ్లిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటూ పలువురు నెటిజన్లు వరుస ట్వీ్ట్లు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. ధనుష్-ఐశ్వర్యలతో మాట్లాడి తిరిగి వాళ్లని ఒకటి చేయండని మలయాళ నటి లక్ష్మీ రామకృష్ణన్‌కు ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన లక్ష్మీ వాళ్ల వ్యక్తిగత విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. దయచేసి వాళ్లని ఒంటరిగా వదిలేయండి.. విడాకులు తీసుకోవడానికి ముందు వేరే వాళ్లతో రిలేషన్ పెట్టుకుని అందరి నోళ్లలో నానే బదులు, ఎవరికీ ఇబ్బంది కలగకుండా గౌరవప్రదంగా విడిపోవడమే మంచిది.. అదేపని ధనుష్, ఐశ్వర్య చేశారు. అది వాళ్ల వ్యక్తిగత జీవితం అని లక్ష్మి రిప్లై ఇచ్చారు.
ఆమె ట్వీట్‌పై స్పందించిన నెటిజన్.. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. కానీ ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించకుండా సైలెంట్‌గా ఎవరి దారి వాళ్లు చూసుకోవాల్సింది.. ఎందుకంటే వాళ్ల ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.. అయినా సెలబ్రిటీల్లో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది అని అన్నాడు.
దానికి లక్ష్మీ సమాధానం ఇస్తూ.. అధికారికంగా ప్రకటించకపోతే వాళ్ల అనుమతి లేకుండా ఎన్నో తప్పుడు ప్రచారాలు జరుగుతాయి. ఉదాహరణకు సమంతనే తీసుకుంటే ఆమె విడాకుల విషయాన్ని ఎంతో హూందాగా ప్రకటించినప్పటికి విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెపై వివాదాస్పద ఆరోపణలు చేశారు అని లక్ష్మి సమాధానం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com