Ntr Dance in Devara : ఎన్టీఆర్ దావూదీ స్టెప్పులపై విమర్శలు

Ntr Dance in Devara :  ఎన్టీఆర్ దావూదీ స్టెప్పులపై విమర్శలు

ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నుంచి లేటెస్ట్ గా దావూదీ అనే సాంగ్ రిలీజ్ చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ ట్యూన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. అనిరుధ్ తెలుగు సినిమాకు పనికి రాడు అనే కమెంట్స్ వస్తున్నాయి. అస్సలే మాత్రం ఆకట్టుకోని ట్యూన్ తో ఓ పెప్పీ సాంగ్ లాగా మలిచాడీ సాంగ్ ను. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోతాయని ఊదరగొట్టారు మేకర్స్. తీరా చూస్తే అందులో అంత పసేం లేదు. ఇంతకు మించిన స్టెప్పులను ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో చేశాడు. వాటితో పోలిస్తే ఈ స్టెప్పులు నథింగ్ అంటున్నారు ఫ్యాన్స్ కూడా. ఇక ఇదే ఇబ్బంది అనుకుంటుంటే.. ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది.

ఈ స్టెప్పులు కంపోజ్ చేసింది శేఖర్ మాస్టర్. కానీ తరచి చూస్తే కొన్నాళ్ల క్రితం తమిళ్ హీరో విజయ్ నటించిన బీస్ట్ మూవీలోని ‘హలామిత్తీ హబిబో’ పాటలోని స్టెప్పుల్లానే ఉన్నాయంటూ ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. చాలా మంది ఈ దావూదీ పాటకు ఆ స్టెప్పులను మ్యాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ శేఖర్ మాస్టర్ ను తిట్టిపోస్తున్నారు.

నిజానికి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ లకంటే టివి షోస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడీ మధ్య. ఆ కారణంగా లేక మనోడిలో విషయం అయిపోయిందా అనేది చెప్పలేం కానీ జానీ మాస్టర్ తో పోలిస్తే చాలా వెనక బడి ఉన్నాడు. అఫ్ కోర్స్ జానీ మాస్టర్ కూడా ఏ స్టెప్పులు కంపోజ్ చేసినా హీరోలు కనిపించరు.. ఈయనే కనిపిస్తాడు. అంటే హీరోల బాడీ లాంగ్వేజ్ ను పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు.

మొత్తంగా ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మేటర్ శేఖర్ మాస్టర్ వద్ద ఆగింది. అతని వల్లే మా హీరో పాట డ్యామేజ్ అవుతుందని తిట్టి పోస్తున్నారు. మరి దీనికి శేఖర్ మాస్టర్ రియాక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Tags

Next Story