Tamil Industry : తమిళ ఇండస్ట్రీలోనూ కమిటీ

మాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చి రిపోర్ట్.. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కుదిపేసింది. అయితే, ఈ రిపోర్ట్ పై కోలీవుడ్ యాక్టర్ విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ రెడీ చేస్తున్నట్లు తెలిపారు. 10 మంది సభ్యులతో ఓ టీమ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘హేమ కమిటీ రిపోర్ట్ గురించి తెలుసుకొని షాక్ అయ్యా. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరం. తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి.. మహిళలతో తప్పుగా ప్రవర్తించేవారికి తగిన బుద్ధి చెప్పాలి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా స్పందించాలి. సినిమాల్లో అవకాశాలిస్తాం. మాకు కొన్ని ఫేవర్స్ చేయాలని అడిగిన వారి చెంప చెళ్లుమనిపించాలి. నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్‌లోనూ పలువురు మహిళలు ఈవిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.తమిళ ఇండస్ట్రీలోనూ ఈ తరహా కమిటీ ఏర్పాటుచేయాలనుకుంటున్నాం. ఈ మేరకు ప్లానింగ్ రెడీ చేస్తున్నం’ అని విశాల్ చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com