Krithi Shetty : లైలా కోసం కృతిశెట్టి, అషికా రంగనాథ్ మధ్య పోటీ

స్టార్ హీరోయిన్లు అవుతారు అనుకున్నవాళ్లు ఒక్కోసారి సడెన్ గా డౌన్ అయిపోతారు.అలాంటి బ్యూటీస్ లో ఈ మధ్య ఎక్కువగా చెప్పుకున్న పేరు కృతిశెట్టి. ప్రస్తుతం తనకు తెలుగులో సినిమాలే లేవు. తమిళ్ లో ఒకటి, మళయాలంలో ఒకటీ చేస్తోంది. ఈ టైమ్ లో టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక్క అవకాశానికీ పోటీ ఉండటం విశేషం.
లేటెస్ట్ గా లైలాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఓ సినిమా రూపొందించబోతున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ కాంబినేషన్ పై టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకోబోతున్నారు. అదే టైమ్ లో నా సామిరంగా ఫేమ్ అషికా రంగనాథ్ ను కూడా అనుకుంటున్నారట. ఈ ఇద్దరి మధ్య ప్రస్తుతం పోటీ ఉంది. ఎవరి డేట్స్ ఈజీ అవైలబుల్ ఉంటాయో వారినే ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. అలా చూస్తే అషికాకు ఎక్కువ ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఇద్దరిలో విశ్వక్ తో రొమాన్స్ చేసేది ఎవరో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com