Waltair Veerayya : 'వాల్తేరు వీరయ్య' వైజాగ్ వస్తున్నాడో లేదో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై సందిగ్దం..
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై సందిగ్దం నెలకొంది.. విశాఖలో ఈనెల 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది.. ఆర్కే బీచ్‌లో స్టేజ్ ఏర్పాట్లపై పోలీసులు ఆంక్షలు విధించారు.. లక్షల్లో ఆడియన్స్ వస్తారనే అంచనాల నేపథ్యంలో జీవో నంబర్ వన్ పేరుతో ఆంక్షలు విధించారు.. ఇప్పటికే ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న సమయంలో పోలీసు ఆంక్షలతో ఈవెంట్ ఎలా నిర్వహించాలన్నదానిపై నిర్వాహకులు డిఫెన్స్‌లో పడిపోయారు.. అయితే, వేదికను ఆంధ్ర యూనివర్సిటీకి షిఫ్ట్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
గాడ్‌ఫాదర్ తర్వాత మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలవుతోంది. జనవరి 8న వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈవెంట్ నిర్వహణకు చిత్ర బృందానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన బాలకృష్ణ వీరసింహారెడ్డికి కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది.
అన్నయ్య తర్వాత బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాలో చిరంజీవి పక్కన రవితేజ నటిస్తున్నాడు. చిరుతో శృతిహాసన్ స్క్రీన్ షేర్ చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్‌లో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com