Sonam Kapoor : సోనమ్ ఇంట్లో దొంగతనం.. నర్సు, ఆమె భర్త అరెస్ట్ ..!

Sonam Kapoor : బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... అనారోగ్యంతో బాధపడుతున్న సోనమ్ కపూర్ అత్త వైద్య సేవల కోసం అపర్ణ రూతు విల్సన్ అనే నర్సును నియమించారు.
ఆమె భర్త నరేశ్ కుమార్ సాగర్ శంకర్పూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో రూ. 2.41 కోట్ల విలువైన నగలు, డబ్బు దొంగతనం జరిగింది. దీనిపైన అదే నెలలో పోలీసులకి కంప్లైంట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ పోలీసులు విచారించారు.
అనుమానం వచ్చిన అపర్ణ ఇంట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు జరపగా అసలు విషయం బయటపడింది. దీనితో ఆమెతో పాటుగా ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే చోరీకి గురైన నగలు, నగదు ఇంకా రికవరీ కాలేదు. కేసు దర్యాప్తు నిమిత్తం న్యూఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్‌కు బదిలీ చేయబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com