Couple-Friendly into OTT : ఓటిటిలోకి కపుల్ ఫ్రెండ్లీ

Couple-Friendly into OTT :  ఓటిటిలోకి కపుల్ ఫ్రెండ్లీ
X

కపుల్ ఫ్రెండ్లీ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే కమర్షియల్ గా ఆ స్థాయిలో విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది ఈ మూవీ. వసూళ్లు భారీగా లేకపోయినా మంచి విజయాన్ని సాధించింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీలో ఇద్దరి నటనకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీలా ఉన్నా.. శాడ్ ఎండింగ్ తో విపరీతంగా ఆకట్టుకుందీ మూవీ. ఓ రకంగా చూస్తే ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ లవ్ స్టోరీస్ లో మొదటి వరసలో ఉంటుందీ మూవీ.

అశ్విన్ చంద్రశేఖర్ అనే తమిళ్ డైరెక్టర్ రూపొందించిన సినిమా ఇది. అతని ఫస్ట్ మూవీ అయినా.. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ ఒకలా.. సెకండ్ హాఫ్ మరోలా సాగే కథనం కట్టి పడేస్తుంది. అలాంటి మూవీని ఓటిటిలో విడుదల చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్ వాళ్లు. ఈ ఓటిటి రిలీజ్ డేట్ ను సడెన్ గా అనౌన్స్ చేయడం విచిత్రంగా ఉంది. అయినా ఇది ఈ శుక్రవారం నుంచి ఓటిటిలోకి అందుబాటులో రాబోతోంది. ఇలాంటి మూవీస్ ఓటిటిలో వచ్చాక అందరూ బలే సినిమా థియేటర్స్ లో మిస్ అయ్యాం కదా అని ఫీల్ అవుతుంటారు. ఏదేమైనా సంతోష్ శోభన్, మానసల నటన మాత్రం కట్టి పడేస్తుంది. మరి ఈ మూవీకి ఓటిటి నుంచి ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి.

Tags

Next Story