Couple Friendly : ప్రమోషన్స్ లో దూసుకుపోతున్న కపుల్ ఫ్రెండ్లీ

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్. ఈ మూవీ ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది. సినిమాపై ముందు నుంచీ పాజిటివ్ టాక్ ఉంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ కోసం సంతోష్ శోభన్ మూడేళ్లకు పైగా ఎఫర్ట్స్ పెట్టాడు. అందుకు తగ్గట్టుగా అతని గత చిత్రాలకంటే కాస్త ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది. ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, అండర్ స్టాండింగ్ బాగా వర్కవుట్ అయినట్టు కనిపిస్తోంది. కథా పరంగా చెన్నైలో సాగినట్టుగా ఉంది. బట్ ఆ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషన్, ఇంటిమసీ బాగా ప్లస్ అయినట్టుగా కనిపిస్తోంది. మిడిల్ క్లాస్ కపుల్ గా కనిపిస్తున్నారు. వీరి మధ్య వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ నుంచి ఈ మూవీపై పాజిటివిటీ బాగా పెరిగిపోయింది.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ పరంగా బాగా సాగుతున్నట్టుగా ఉంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ తమ భుజాలపై ప్రమోషన్స్ మోస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ కంటెంట్ పై వారికి చాలా నమ్మకం ఉన్నట్టుగా ఉంది. అది ఆ ఇద్దరి ఇంటర్వ్యూస్ లో కూడా బాగా కనిపిస్తోంది. ఇంటర్వ్యూస్ లో కూడా వీరి ఇంటిమసీ బాగా వర్కవుట్ అయినట్టుగా ఉంది. దీంతో పాటు ప్రెస్ మీట్స్ లోనూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ మూవీతో మంచి విజయం అందుకోవడం గ్యారెంటీ అనిపించేలా ఉన్నారీ ఇద్దరు. మరి ప్రమోషన్స్ లోనే కాకుండా కంటెంట్ పరంగా కూడా ఆకట్టుకుంటేనే హిట్ కొట్టేది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
