Mad Square : కంట్రీని షేక్ చేస్తోన్న కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మూవీ

Mad Square  :  కంట్రీని షేక్ చేస్తోన్న కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మూవీ
X

గత మార్చి నెలలో విడుదలైన కోర్ట్ మూవీ ప్రస్తుతం బిగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చిన దగ్గర్నుంచీ కంట్రీ మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. ఈ వారం( ఏప్రిల్ 21 -27 వరకు) చూస్తే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ లో సెకండ్ ప్లేలో నిలవడం విశేషం. ఓ చిన్న సినిమా.. పైగా ఆర్టిస్టులెవరూ ప్యాన్ ఇండియా స్థాయిలో తెలిసినవాళ్లు కాదు. అయినా ఆ రేంజ్ లో అప్లాజ్ వస్తోందంటే కారణం కంటెంటే అని వేరే చెప్పక్కర్లేదు. ప్రియదర్శి మెయిన్ లీడ్ గా హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయికుమార్, శివాజీ, రోహిణి, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పోక్సో చట్టంపై అవగాహన పెంచాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ఓ బాధితుడికి అండగా నిలిచిన వైనాన్ని చూపిస్తుంది. అలాగే అందమైన టీనేజ్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఓటిటిలో మరింతగా ఆకట్టుకుంటోందని చెప్పొచ్చు.

ఇక థర్డ్ ప్లేస్ లో మ్యాడ్ స్క్వేర్ నిలవడం మరో విశేషం. వీళ్లూ కొత్త కుర్రాళ్లే. అయినా క్రింజ్ కామెడీతో బాక్సాఫీస్ ను గెలిచారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడం సెకండ్ పార్ట్ కు థియేటర్స్ లో ప్లస్ అయింది. ఈ పార్ట్ లోనూ మంచి కామెడీ వర్కవుట్ కావడంతో మరింత మెప్పించింది. అందుకే ఓటిటిలో థర్డ్ ప్లేస్ లో నిలిచి మరోసారి గెలిచిందీ మూవీ.

ఇక ఈ వారంలో టాప్ టెన్ లో ఉన్న మూవీస్ చూస్తే..

1. జ్యూయొల్ థీఫ్

2. కోర్ట్

3. మ్యాడ్ స్క్వేర్

4. ఛావా

5. ఐ హోస్టేజ్

6. బుల్లెట్ ట్రెయిన్ ఎక్స్ ప్లోజన్

7. హ్యావోక్

8. దేవా

9. టెస్ట్

10. డ్రాగన్ (తమిళ్)

చిత్రాలు వరుసగా ఉన్నాయి.

Tags

Next Story