Court collections : ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టిన కోర్ట్

నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ మూవీ స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ కంటెంట్ కూడా ఉందని కితాబు ఇస్తున్నారు. ఓ చిన్న లవ్ స్టోరీ చుట్టూ అల్లుకున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రతి ఒక్కరినీ ఫిదా చేస్తుంది. రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మన చట్టంలో కొన్నాళ్ల క్రితమే చేరిన పోక్సో గురించిన చర్చ కూడా కనిపిస్తుంది. ఈ చట్టం గురించిన అవగాహనను పెంపొందించే అవసరం కూడా ఉందని తెలియజేస్తుంది. అలాగని ఏదో డాక్యుమెంటరీలా కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. రిలీజ్ కు ముందే చాలా పాజిటివిటీ సంపాదించుకున్న కోర్ట్ ప్రీమియర్స్ తోనూ సత్తా చాటింది. ఇవన్నీ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చాయి.
కోర్ట్ మూవీ మొదటి రోజు అనూహ్యంగా 8.10 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే స్టార్ కాస్ట్ లేకుండా కేవలం చిన్న కుర్రాళ్ల ప్రేమకథకు పెద్దల సపోర్ట్ లాగా ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, హర్ష వర్ధన్, రోహిణి వంటి వారు కనిపించిన ఈ మూవీ ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అంటే వెనక నాని ఉన్నాడనీ, అతని కథల ఎంపిక బావుంటుందని ప్రేక్షకులు నమ్మారు అని అర్థం. ఈ మధ్య టైర్ 3 హీరోల సినిమాలు కూడ ఈ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు అనేది నిజం. అలాంటిది ఇంత చిన్న సినిమా అంత పెద్ద మొత్తం ఫస్ట్ డే నే రాబట్టింది కోర్ట్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయినట్టే అని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com