Court Movie : మూడు రోజుల్లో కోర్ట్ మూవీ కలెక్షన్స్ ఎంతంటే..?

నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమా కోర్ట్. రామ్ జగదీష్ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ టీనేజ్ లవ్ స్టోరీకి పోక్సో చట్టం ఆధారంగా దర్శకుడు రాసుకున్న ఈ కథ చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చేస్తోంది. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఇప్పటి వరకూ ఉన్న షౌటింగ్స్ లాంటివేం లేకుండా చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉండేలా ప్రయత్నించడం ఇంకా బావుంది. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ .. ఓ కుర్ర జంట పడే ఆవేదన, చేయని తప్పుకు తన కొడుకు బలైపోతాడు అని ఒక కుటుంబ సంఘర్షణ, దీనికి ఓ యువ లాయర్ చేసిన పోరాటం.. కోర్ట్ లో ఆ ‘16’నిమిషాలు ఏం జరిగింది అనే సస్పెన్స్ ను చివరి వరకూ మెయిన్టేన్ చేస్తూ దానికి ఓ గొప్ప అమాయకత్వపు ఫినిషింగ్ ఇవ్వడం.. వెరసి పోక్సో చట్టం అమలవుతున్న విధానంతో పాటు ఆ చట్టం గురించిన అవగాహనపైనా కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు దర్శకుడు. అవేం డ్రమటిక్ గా ఉండవు. చాలా సింపుల్ గా తేల్చేస్తాడు.
ఇక నాని ప్రాపర్ ప్రమోషన్స్ తో ఈ చిత్రాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. రెండు రోజుల ముందే వేసిన ప్రీమియర్స్ కు మంచి స్పందన వచ్చింది. ఆ ప్రీమియర్స్ తో కలిపి ఈ మూవీ ఫస్ట్ డే ఏకంగా 8.10 కోట్లు వసూలు చేసి ట్రేడ్ ను ఆశ్చ్యపరిచింది. రెండో రోజు 7.80 కోట్లు, మూడో రోజైన ఆదివారం 8.50 కోట్లు వెరసి ప్రపంచ వ్యాప్తంగా 24. 40 వరకూ వసూళ్లు వచ్చాయి.
పెద్దగా పోస్టర్ వాల్యూ లేని మూవీ కేవలం కంటెంట్ తోనే ఈ కలెక్షన్స్ సాధించడం అంటే అంత చిన్న విషయం కాదు. బలమైన కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తారు అనేదానికి ఈ మూవీ మరో ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ఊరికే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ నానా హంగామా చేయడం కంటే ఇలా సింపుల్ స్టోరీస్ తో మనసులు దోచుకుంటే మనీ కూడా వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com