క్రేజీ కాంబినేషన్.. ధనుష్ విత్ శేఖర్ కమ్ముల

క్రేజీ కాంబినేషన్.. ధనుష్ విత్ శేఖర్ కమ్ముల
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన చిత్రాలు ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి. హాయిగా మనసుకు హత్తుకునేలా రూపొందించే అతడి తరువాతి ప్రాజెక్ట్‌ల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. మంచి కాఫీ లాంటి కథతో పాటు సంగీతానికీ పెద్ద పీట వేస్తారు శేఖర్. ఇక తమిళ హీరో ధనుష్. కోలీవుడ్‌లో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు. వెరైటీ కథాంశాన్ని ఎంచుకుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు.

మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటూ మంచి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు ధనుష్. మరి ఇప్పుడు ఈ యంగ్ హీరో తెలుగులో ఓ స్ట్రెయిట్ చిత్రాన్ని, అదీ శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో పని చేయడానికి ఒప్పుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి


చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో బిజీగా ఉన్నారు. అలాగే ధనుష్.. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న అత్రాంగి రే, హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ షూట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత శేఖర్ కమ్ములతో జాయినవుతారు ధనుష్.

Tags

Read MoreRead Less
Next Story