Crazy News : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి

Crazy News : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి

టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలకృష్ణ చాలా రోజుల తర్వాత ఒకే వేదికను పంచుకోనున్నారు. బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్‌లో గెస్ట్‌గా మెగాస్టార్ రాబోతున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇక చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడవచ్చని టాక్‌ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా బాలయ్య-చిరు అభిమానుల మధ్య గొడవలు పీక్స్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు పోటీ తగ్గడంతో పాటు జనసేన టీడీపీ కలిసి పనిచేయడం ఆసక్తికరం. ఇక ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన వినోదం ఏముంటుంది చెప్పండి. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ టాక్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ, రానా, చంద్రబాబు తదితర ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే.

Tags

Next Story