Crazy Update for NTR Fans : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా వస్తుందని మూడు నాలుగేళ్లుగా న్యూస్ వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసేది ప్రశాంత్ నీల్ తోనే అనుకున్నారు. బట్ అతను త్రివిక్రమ్ తో మూవీకి కమిట్ అయ్యాడు. అదీ ఫైనల్ కాలేదు. ఇప్పుడు కొరటాల శివతో దేవర చేస్తున్నాడు. ఇది కూడా రెండు భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ దేవర 1 సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. దీంతో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' షూటింగ్ లో కూడా సైమల్టేనియస్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు.
ఇక ప్రశాంత్ నీల్ తో మూవీకి కూడా ముహూర్తం సెట్ అయింది. ఈ నెల 9న ఈ క్రేజీ కాంబోలోని ప్రాజెక్ట్ అఫీషియల్ గా స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అంటే ముహూర్తం పెడతారు. మరి రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో కానీ ప్రాజెక్ట్ అయితే త్వరలోనే పట్టాలెక్కబోతోంది. నిజానికి ప్రశాంత్ నీల్ సలార్ 2 తర్వాతే ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ చేస్తాడు అనుకున్నారు. కానీ దానికంటే ముందే తారక్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ మార్పులు చూస్తే సలార్ 2 ఉంటుందా అనే డౌట్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. బట్ ప్రశాంత్ అంత సులువుగా వదిలేసే టైప్ కాదు. సో.. ఎన్టీఆర్ తో పాటు సలార్ 2 కూడా చేసినా ఆశ్చర్యం లేదు.
మొత్తంగా రెండేళ్ల క్రితమే ఎన్టీఆర్ తో చేసే సినిమాకు టైటిల్ గా 'ట్రాన్స్ ఫార్మర్' అని హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. మరి అదే టైటిల్ తో ఈ మూవీ ఉంటుందా లేదా అనేది చెప్పలేం కానీ.. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కు ముహూర్తం సెట్ అయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com