Rajamouli-Mahesh Movie: అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి- మహేష్ మూవీ..

Rajamouli-Mahesh Movie:   అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి- మహేష్ మూవీ..
X
Rajamouli-Mahesh Movie: సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. అనే పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ ను డబుల్ చేస్తూ ఈ మధ్య ప్రతి సినిమాతోనూ హిట్ అందుకుంటున్నాడు మహేష్‌.

Rajamouli-Mahesh: సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. అనే పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ ను డబుల్ చేస్తూ ఈ మధ్య ప్రతి సినిమాతోనూ హిట్ అందుకుంటున్నాడు మహేష్‌. తన పర్సనల్ లైఫ్ లో ఈ యేడాది పెద్ద గాయంగా నిలిచిపోయినా.. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటున్నాడు.



ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నా.. ఎందుకో కొన్ని రోజులుగా ఎక్కువగా రాజమౌళితో చేసే సినిమా విషయాలే హైలెట్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ వచ్చిన వార్తలు ఓ లెక్క అయితే... రాజమౌళి సినిమాపై ఇప్పుడు వస్తోన్న వార్తలు ఓ లెక్క అన్నట్టుగా ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ న్యూస్ ఒకటి హల్చల్ చేస్తోంది.


రాజమౌళి డైరెక్షన్ లో ఒక్కసారైనా నటించాలి అని కోరుకోని హీరో ఉండడు. ప్యాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ మహేష్‌ బాబుతో ఉంటుందని చాలా రోజుల క్రితమే చెప్పాడు. తెలుగులో కెఎల్ నారాయణ నిర్మించబోతోన్న చిత్రం ఇది. మామూలుగానే సినిమా సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుంటాడు రాజమౌళి.



మేకింగ్ విషయంలో చాలా టైమ్ పడుతుంది. అందుకే మహేష్‌ బాబు త్రివిక్రమ్ తో మూవీకి కమిట్ అయ్యాడు. కానీ ఆ కథ నచ్చలేదని కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలో అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అందరూ అడుగుతున్నారు. అలా ప్రతిసారీ మహేష్‌ మూవీపై అంచనాలు పెంచుతున్నాడు రాజమౌళి.


మహేష్‌ బాబుతో చేయబోయే సినిమా మామూలుగా ఉండదని.. ఇప్పటి వరకూ ఇండియాలో రాని ఓ గ్రేట్ స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పి ఉన్నాడు. అయితే ఈ మూవీకి లేటెస్ట్ గా మరో ఎసెట్ యాడ్ కాబోతోందని చెప్పాడు రాజమౌళి.



తెలుగులో కెఎల్ నారాయణ నిర్మిస్తున్నా.. ఇతర దేశాలకు సంబంధించి ఓ హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటోందట. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వినిపిస్తోన్న ప్రతి వార్తా.. చూస్తోంటే.. మహేష్‌.. త్రివిక్రమ్ ను వదిలేసి రాజమౌళి మూవీకే ముందు డేట్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Tags

Next Story