Chiranjeevi : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీపై బోలెడు అప్డేట్స్

Chiranjeevi :  చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీపై బోలెడు అప్డేట్స్
X

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన టైమింగ్ కు కమెడియన్స్ కూడా ఖంగారు పడతారు అనేది నిజం. దానికి తనదైన ఆరా కూడా యాడ్ అవుతుంది. అందుకే ఆయన ఈ తరహా సినిమాలు చేసినప్పుడు ఆడియన్స్ డబుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక కామెడీ ఎంటర్టైనర్స్ తోనే ఇండస్ట్రీ హిట్ వరకూ వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ అంటే ఫ్యాన్స్ ఇంకెంత ఎక్స్ పెక్ట్ చేస్తారు..? అందుకే ఆ విషయంలో ఏం డౌట్ పడక్కర్లేదు అనే హామీ ఇస్తున్నాడు అనిల్. త్వరలోనే పట్టాలెక్కబోతోన్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బోలెడు కబుర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమా కాదా అనేది పక్కన పెడితే.. నిజమైతే బావుండు అనిపించే వార్తలు.

ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు అనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇందులో ఆయన పాత్ర పేరు రాజా రామ్ అంటున్నారు. అంటే రాజా అండ్ రామ్ కావొచ్చు అనేది ఓ రూమర్. పైగా ఈ పేరు ఆయన ఐకనిక్ మూవీ గ్యాంగ్ లీడర్ లో ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లుంటారట. అందులో ఒకరు అదితిరావు హైదరి అంటున్నారు. అలాగే సీనియర్ సరసన భూమికా చావ్లా ఉండే అవకాశాలున్నాయంటున్నారు. అన్నిటికీ మించి ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా అనేది హైలెట్ గా కనిపిస్తోంది. సో.. అదితిరావు ఇంకా కమిట్ అవలేదు. కానీ భూమిక ఆల్మోస్ట్ ఫైనల్ అంటున్నారు.

ఇప్పటికే ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ అయింది. సెకండ్ హాఫ్ పై వర్క్ జరుగుతోంది. సో.. వీలైనంత త్వరగా సెకండ్ హాఫ్ ను కూడా చిరంజీవితో ఒప్పిస్తే సమ్మర్ లోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ స్పీడ్ అందరికీ తెలుసు. అందుకే ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేస్తాం అనే కాన్ఫిడెంట్ తోనే రంగంలోకి దిగుతున్నారు. ఇక మెగాస్టార్ కూడా ఈ వయసులోనూ ఎర్లీ మార్నింగ్ ఏ టైమ్ కు ఫస్ట్ షాట్ చెబితే ఆ టైమ్ కు మేకప్ తో రెడీగా ఉంటాడు. సో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంక్రాంతికి రావడం ఖాయం అనుకోవచ్చు.

Tags

Next Story