Ram Charan : రామ్ చరణ్, సుకుమార్.. రంగస్థలంను మించే కథతో

Ram Charan :  రామ్ చరణ్, సుకుమార్.. రంగస్థలంను మించే కథతో
X

రామ్ చరణ్ లోని నటుడుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన సినిమా అంటే ఖచ్చితంగా రంగస్థలం అనే చెబుతారు. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రెగ్యులర్ కమర్షియల్ హీరోగానే కనిపించాడు చరణ్. రంగస్థలంతో నటుడుగానూ సత్తా చాటాడు. తర్వాత ఆర్ఆర్ఆర్ అతన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఆ స్థాయిని నిలబెడుతుంది అనుకున్న గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'చిత్రంలో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. పెద్ది తర్వాత మరోసారి సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు చరణ్.

రంగస్థలం తర్వాత రాబోతోన్న మూవీ కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. పైగా సుకుమార్ అటు అల్లు అర్జున్ కు వాల్డ్ వైడ్ ఇమేజ్ వచ్చేలా పుష్ప, పుష్ప 2 చిత్రాలు అందించి ఉన్నాడు. పుష్పతో ఉత్తమ నటుడుగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు ఐకన్ స్టార్. సో.. ఈ ఒత్తిడి కూడా సుకుమార్ పై ఉంటుంది. అందుకే అన్నిటికీ సమాధానం చెప్పేలా ఈ చిత్రాన్ని అందించాలనే కసితో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట.రంగస్థలంను మించి, పుష్పను దాటి అనేలాంటి కంటెంట్ నే సిద్ధం చేస్తున్నాడట సుకుమార్. ప్రస్తుతం చాలా వేగంగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. సినిమాను 2026 సమ్మర్ లో స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. ఆలోగా మార్చి 27న పెద్ది విడుదలవుతుంది. ఆపై ఒక నెల గ్యాప్ తీసుకుని సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేస్తాడట రామ్ చరణ్.

Tags

Next Story