Yash : టాక్సిక్ తో బలే ట్రెండ్ సెట్ చేశారు..

Yash :  టాక్సిక్ తో బలే ట్రెండ్ సెట్ చేశారు..
X

ఇండియాలో ఏ సినిమా అయినా హీరో సెంట్రిక్ గానే సాగుతుంది. అంటే కేవలం హీరోయిన్ తోనే సాగడం వేరు విషయం. బట్ ఒక స్టార్ హీరో ఉన్నా కూడా హీరోయిన్ ల ఫస్ట్ లుక్ తో అదరగొట్టడం మాత్రం చాలా చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది టాక్సిక్ మూవీ. హీరో యశ్. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత అతని రేంజ్ ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. అయినా కూడా హీరోయిన్ల లుక్ తో అతను కంటే ముందే వస్తుండటం మాత్రం నిజంగా హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ది బెస్ట్ లుక్స్ అంటూ రిలీజ్ చేసింది టీమ్. తాజాగా మరో హీరోయిన్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రుక్మిణి వసంత్ ను మెల్లిసా పాత్రలో పరిచయం చేశారు. తన లుక్ అదిరిపోయింది. ఆకట్టుకునేలా రూపొందించారు. ఆల్ట్రా మోడ్రన్ తో తన స్టిల్ పరిచయం చేశారు.

ఇక అంతకు ముందు గంగ పాత్రలో నయనతారను పరిచయం చేశారు. ఆమె పోస్టర్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించారు. తర్వాత కియారా అద్వానీ పాత్ర నదియా అంటూ ఇంటర్ డ్యూస్ చేశారు. ఆమె లుక్కూ అదిరిపోయింది. ఎలిజబెత్ గా హ్యూమా ఖురేషీ పాత్రలో కనిపించబోతోంది. తారా సుతారియాను రెబెకా పాత్రతో పరిచయం చేశారు. ఈ అన్ని లుక్స్ కూడా దేనికది భిన్నంగా ఉన్నాయి. అదే టైమ్ లో సిమిలర్ గానూ కనిపిస్తున్నాయి. అన్నిట్లోకి కేవలం హీరోయిన్ల ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేయడం మాత్రం గొప్ప విషయంగానూ కనిపిస్తోంది. మరి ఈ మొత్తంలో యశ్ పాత్రను ఏ రేంజ్ లో పరిచయం చేస్తారు అనేది మాత్రం చూడాలి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం చేస్తోన్న ఈ మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో మరోసారి అదరగొట్టబోతోంది అనిపించారు. ఇక సినిమాను మాత్రం మార్చి 19న విడుదల చేయబోతున్నారు.

Tags

Next Story