Poonam Kaur : ఈ సారి పూనమ్ కౌర్ బుక్ అయిందిగా

అప్పుడెప్పుడో 2006లో మాయాజాలం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూనమ్ కౌర్. హీరోయిన్ గా స్టార్డమ్ తెచ్చుకోలేదు కానీ బబ్లీ బ్యూటీగా మంచి పేరొచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రయత్నాలు చేసినా ఎక్కడా స్టార్డమ్ దక్కలేదు. మధ్యలో ఏం జరిగిందో కానీ.. కొన్నేళ్లుగా తను ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు పేర్లు చెప్పకుండా శృతి మించింది కూడా. తాజాగా కొరియోగ్రాఫర్ జానీ దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ సారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ డైరెక్టర్ గా ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. తను గతంలో త్రివిక్రమ్ పై చేసిన కంప్లైంట్ పై చర్యలు తీసుకుని ఉంటే నాతో పాటు నాలాంటి వాళ్లు రాజకీయ ఒత్తిళ్లకు బలైపోయే వాళ్లు కాదు అనేది ఆమె పోస్ట్ సారాంశం. అంటే తనను త్రివిక్రమ్ ఇబ్బంది పెట్టాడు అనేది తన ఉద్దేశ్యం కావొచ్చు. కానీ టాలీవుడ్ అయినా.. పోలీస్ స్టేషన్ అయినా ఇలా ఆరోపణలు చేయడం కాదు.. ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్పాలి. ఇబ్బంది పెట్టడం అంటే లైంగికంగా వేధించడా లేక ఆఫర్స్ ఇస్తా అని మోసం చేశాడా లేదూ.. ఇంకేవైనా కారణాలతో తన కెరీర్ ను చిదిమేశాడా..? ఇలాంటి కేటగిరీలు చాలానే ఉన్నాయి. అలా కాకుండా కేవలం త్రివిక్రమ్ పైన ఆరోపణలు చేస్తే కాదు.. ఆధారాలు కూడా ఉండాలి కదా. అలాగని ఇక్కడ త్రివిక్రమ్ ను వెనకేసుకు రావడం కాదు.. తప్పు చేస్తే ఎవరైనా శిక్షించబడాల్సిందే. కానీ ఆ శిక్ష వేయాలంటే ప్రాపర్ ప్రూఫ్స్ కావాలి కదా.
ఇక ఇదే విషయం మీద సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ అసలు ఆమె కంప్లైంటే చేయలేదు అని తేల్చి పడేశాడు. ఇప్పటికైనా ఛాంబర్ లో ఉన్న బాక్స్ లోనో లేక, మెయిన్ లోనో, అదీ లేదంటే వాట్సాప్ లోనో కంప్లైంట్ చేస్తే ఆ సమస్యపై ఇండస్ట్రీ స్పందిస్తుందని ఖచ్చితంగా చెప్పాడు తమ్మారెడ్డి. దీంతో ఇక్కడ బుక్ అయింది పూనమ్ కౌర్. అసలు తను కంప్లైంట్ చేయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే వాటిని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. కనీసం ఈ విషయంపై పోలీస్ డిపార్ట్ మెంట్ ను అయినా ట్యాగ్ చేసి తనకు న్యాయం చేయమంటే వాళ్లైనా స్పందిస్తారు.. డిపార్ట్ మెంట్ లో విమెన్ వింగ్స్ ఉంటాయి. అక్కడైనా తన సమస్య చెప్పొచ్చు. ఇవేం లేకుండా కేవలం ఆరోపణలు చేయడం చూస్తుంటే తను ఇంకేదో అక్కసుతోనే ఇదంతా చేస్తున్నట్టు చూస్తున్నవారికి అర్థం అవుతుంది కదా. ఏదేమైనా పూనమ్ కు నిజంగా అన్యాయం జరిగి ఉంటే.. ఇప్పటికైనా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి వాళ్లు సూచించిన పద్ధతుల్లో ఏదో రకంగా ఫిర్యాదు చేయడం బెటర్. లేదంటే ఇకపై ఆమె సోషల్ మీడియా పోస్ట్ లకు మినిమం క్రెడిబిలిటీ కూడా ఉండదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com