Kaathu Vaakula Rendu Kaadhal: సినిమాల్లోకి క్రికెటర్ శ్రీశాంత్ ఎంట్రీ.. సమంతతో..

Kaathu Vaakula Rendu Kaadhal: విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కాతు వాకుల రెండు కాదల్' ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార , సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెటర్ శ్రీశాంత్ తొలిసారిగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు.
"క్రికెట్ మైదానంలో నిజమైన ఛాంపియన్, ఖచ్చితంగా సిల్వర్‌స్క్రీన్‌ను కూడా శాసించబోతున్నాడు. శ్రీశాంత్‌ను మహమ్మద్ మోబీగా పరిచయం చేస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 11న చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు.
ట్రయాంగిల్ లవ్‌లో ఎదుర్కొనే సమస్యలు ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని ఇంకా అనౌన్స్ చేయలేదు.
నిజానికి ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సమంత శాకుంతలం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com