Yuvraj Singh Biopic: నా బయోపిక్‌లో వాళ్లు నటిస్తే బాగుంటుంది: యువరాజ్

Yuvraj Singh Biopic: రీమేక్, బయోపిక్.. ఈ రెండిటి పైనే గత కొంతకాలంగా బాలీవుడ్ దృష్టంతా ఉంది. మనకు తెలిసిన వారే కాదు.. తెలియని వారి జీవితాల గురించి ఆసక్తికరంగా చెప్పినా ప్రేక్షకులు వింటారు. అందుకే బయోపిక్‌లు చాలావరకు హిట్ టాక్‌ను అందుకుంటాయి. ఇప్పటికే హిందీలో పలువురు క్రికెటర్ల బయోపిక్‌లు తెరకెక్కి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా మరో క్రికెటర్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ధోనీ, సచిన్ బయోపిక్‌లు హిందీలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఇండియన్ క్రికెట్‌లో వారి తర్వాత తనదైన ముద్ర వేసుకున్న యువరాజ్ సింగ్ కూడా తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే ఈ బయోపిక్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసారట. మరి ఇందులో నటించబోయే హీరో ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతంలో తన బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు హృతిక్ రోషన్, రణభీర్ కపూర్‌లలో ఎవరు తన క్యారెక్టర్‌ను ప్లే చేసినా తనకు ఇష్టమేనని యువరాజ్ సింగ్ అన్నాడు. కానీ కరణ్ మాత్రం ఈ ఇద్దరు స్టార్లను కాదని కొత్త హీరో అయితే బాగుంటాడన్న ఆలోచనలో ఉన్నాడట. స్టార్ హీరోలతో అయితే ఈ బయోపిక్ తొందరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని కొందరి వాదన.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com