Johnny Master : జానీ మాస్టర్ పై క్రిమినల్ కేస్.. జనసేన మాస్టర్ స్ట్రోక్

Johnny Master :  జానీ మాస్టర్ పై క్రిమినల్ కేస్.. జనసేన మాస్టర్ స్ట్రోక్
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేస్ నమోదైంది. మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ డ్యాన్సర్ అతనిపై పోలీస్ కేస్ పెట్టింది. కొన్నాళ్ల క్రితం తను తెలుగు ఢీ షోలో విన్నర్. ఆ టైమ్ లో జానీ మాస్టర్ జడ్జ్ గా వ్యవహించాడా షోకి. తర్వాత తను వెళ్లిపోయింది. ఆమె కాంటాక్ట్ సంపాదించి ముంబైలో ఓ ఈవెంట్ కోసం పిలిపించాడట. అదే రోజు హోటెల్ గదిలో తనపై అత్యాచారం చేశాడని.. ఎవరికైనా చెబితే ఊరుకోనని బెదిరించాడని ఆ యువతి కేస్ లో పేర్కొంది. ఆ తర్వాత కూడా తనను బలవంతంగా తన టీమ్ లోకి తీసుకుని అనేక సార్లు అఘాయిత్యం చేశాడని చెప్పింది. అంతే కాక తనను పెళ్లి చేసుకోవాలని.. దానికి ముందు మతం కూడా మార్చుకోవాలని ఒత్తిడి చేశాడనీ.. ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య కూడా ఆమె ఇంటికి వెళ్లి మరీ భర్తను పెళ్లి చేసుకోమని చెప్పింది ఆ యువతి కంప్లైంట్ లో పేర్కొనడం విశేషం.

ఏ భార్య అయినా తన భర్త వేరే వారితో సంబంధం పెట్టుకుంటేనే సహించదు. అలాంటి ఈవిడే వెళ్లి ‘మా ఆయన్ని పెళ్లి చేసుకో’ అని బతిమాలిందట. ఆ యువతి ఈ మొత్తం విషయంలో బలమైన సాక్ష్యాలతో పోలీస్ లను ఆశ్రయించింది. మొదట ఈ వ్వవహారాన్ని ఫిలిమ్ ఛాంబర్ లో సెటిల్ చేయాలని ప్రయత్నించాడట జానీ మాస్టర్. కుదరలేదు. దీంతో యువతి పోలీస్ లనే ఆశ్రయించింది. నిజానికి ఈ కేస్ పెట్టి కూడా రెండు రోజులు దాటిందట. అయితే పోలీస్ లు అన్ని వైపుల నుంచి పరిశీలించి ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఉండేలా అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాతే క్రిమినల్ కేస్ లు పెట్టారంటున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కు ఈ కేస్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు అనే అంటున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడంటున్నారు.

ఇక కొన్నాళ్లుగా పొలిటికల్ స్టెప్పులు కూడా వేస్తోన్న జానీ విజయవాడ వరదల టైమ్ లో తన వంతుగా జనసేన కండువా కప్పుకుని సాయం చేశాడు. అఫ్ కోర్స్ ముందు నుంచీ అతను జనసేన కార్యకర్తగానే ఉన్నాడు. ఈ వ్వవహారం బయటపడటంతో పార్టీ ఇమ్మీడియెట్ గా రియాక్ట్ అయింది. ఇక పై జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన వద్దు అని ఆదేశిస్తూ.. బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీలు తమ నాయకులు, కార్యకర్తలను ఆదుకునే ప్రయత్నం చేస్తారు. బట్ జనసేన నిజాయితీగా అడుగు వేసింది. దీంతో జానీకి ఈ అండ కూడా లేకుండా పోయింది.



మొత్తంగా గతంలో కూడా జానీ మాస్టర్ ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. ఈ సారి ఆధారాలతో సహా దొరికిపోయాడు అంటున్నారు.

Tags

Next Story