Sai Dharam Tej: మెగా హీరో యాక్సిడెంట్ కేస్.. త్వరలో ఛార్జ్‌షీట్

Sai Dharam Tej: మెగా హీరో యాక్సిడెంట్ కేస్.. త్వరలో ఛార్జ్‌షీట్
X
Sai Dharam Tej: అతడి నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకే త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం అని సీపీ వెల్లడించారు.

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కమిషన్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం.

లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ తదితర వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకే త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం అని సీపీ వెల్లడించారు.

కాగా, సప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వెళుతున్న సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారు.. దాదాపు నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. ప్రస్తుతం సాయి‌తేజ్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు.

Tags

Next Story