D 51 : ధనుష్ - శేఖర్ ఖమ్ముల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'పుష్ప' హీరోయిన్

D 51 : ధనుష్ - శేఖర్ ఖమ్ముల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుష్ప హీరోయిన్
X
'పుష్ప' తర్వాత భారీ ఆఫర్ కొట్టేసిన నేషనల్ క్రష్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ బిగ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రాబోతున్న ఓ సినిమాలో హీరో ధనుష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీనిపై రష్మిక కూడా సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'సార్' సినిమాతో ధనుష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం తమిళంలో మిల్లర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు ధనుష్. కాగా గత కొన్ని రోజుల నుంచి ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ధనుష్ కు 51వ సినిమాగా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఏషియన్ సునీల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలోనే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు.

ఇక శేఖర్ కమ్ముల విషయానికొస్తే.. ఆయన సినిమాలంటే మామూలుగానే హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హీరోయిన్లను హైలెట్ చేసి చూపించడం ఆయనకున్న స్పెషల్ టాలెంట్. దీన్ని బట్టి చూస్కుంటే రష్మిక పాత్రకు కూడా బాగానే ఇంపార్టెన్స్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రష్మిక సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా వెల్లడించింది. 'D 51'తో తన కొత్త జర్నీ ప్రారంభమైందని తెలిపింది. దాంతో పాటు శేఖర్ కమ్ముల, ధనుష్ అకౌంట్లను కూడా ఆమె ట్యాగ్ చేసింది.


Tags

Next Story