సినిమా

D Imman : విడాకులై మూడు నెలలు... రెండో పెళ్ళికి రెడీ అయిపోయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

D Imman : తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్ళికి సిద్దమైనట్టుగా కోలీవుడ్‌‌లో వార్తలు కోడై కూస్తున్నాయి.

D Imman : విడాకులై మూడు నెలలు... రెండో పెళ్ళికి రెడీ అయిపోయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!
X

D Imman : తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్ళికి సిద్దమైనట్టుగా కోలీవుడ్‌‌లో వార్తలు కోడై కూస్తున్నాయి. 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్నాడు ఇమ్మాన్... 13 ఏళ్ళు వివాహబంధం తర్వాత వీరిద్దరూ గతేడాది డిసెంబర్‌‌లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఉమను.. ఇమ్మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని సమాచారం. మే లో ఈ పెళ్లి జరగనుందని టాక్.. త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కోలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇమ్మాన్ ఒకరు.. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్‌ జంటగా నటించిన తమిజన్‌ చిత్రంతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఇమ్మాన్ .. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకోగా, వీరికి వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే ఈ జంట గతేడాది డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నట్టుగా ఇమ్మాన్ తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

అటు డి.ఇమ్మాన్ సంగీతం అందించిన సూర్య నటించిన ఎనీథింగ్ డేర్ 10వ తేదీన థియేటర్లలోకి రానుంది. బండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలను పెంచాయి.

Next Story

RELATED STORIES