Dacoit Glimpse : అడివి శేష్ కూడా బూతులకు దిగాడా

Dacoit Glimpse :  అడివి శేష్ కూడా బూతులకు దిగాడా
X

టాలెంటెడ్ ఫిల్మ్ లవర్ కమ్ హీరో అడివి శేష్. స్వయంకృషితో తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానే కాక కంటెంట్ రైటర్ గానూ, స్క్రీన్ ప్లే ఎక్స్ పర్ట్ గానూ పేరు తెచ్చుకున్నాడు. తను రాసిన కథలతోనే ఎక్కువ విజయాలు సొంతం చేసుకుంటోన్న శేష్ నెక్ట్స్ మూవీ ‘డెకాయిట్’. శ్రుతి హాసన్ హీరోయిన్ గా కొన్నాళ్ల క్రితమే మొదలైంది ఈ ప్రాజెక్ట్. కొంత షూటింగ్ తర్వాత శ్రుతి హాసన్ తప్పుకుంది. అప్పుడు ఓ టీజర్ విడుదల చేశారు కూడా. అయినా తను తప్పుకోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది.

శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘డెకాయిట్ ఫైర్ గ్లింప్స్’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో శేష్ వాడిన ఒక బూతు పదం చూస్తే అతను కంటెంట్ ను బట్టి దిగజారాడా లేక ట్రెండ్ ను బట్టి దిగజారాడా అనేది అర్థం కాకుండా ఉంది. గ్లింప్స్ చూస్తే.. ‘హే జూలియట్.. నీకు జరిగినాది మామూలు విషయం కాదు. అందరూ నిన్ను మోసం సేసినారు.. కానీ నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు.. గుడిపించేయడానికి వచ్చినాను.. హ హ.. దీనెమ్మ’అనే శేష్ వాయిస్ ఓవర్ తో ఉంది. ఇలాంటి వర్డ్స్ శేష్ లాంటి నటుడు నుంచి రావడం కొంత ఆశ్చర్యంగానే ఉంది. ఇవి సినిమాలో ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే బూతు లేకపోతే కంటెంట్ లేదు అన్నట్టుగా అతన్లాంటి వాడు కూడా భావించడం ఏంటో మరి అతనికే తెలియాలి.

గ్లింప్స్ లో వాయిస్ తో పాటు వచ్చే విజువల్స్ అన్నీటిలోనూ ఫైర్ కనిపిస్తుంది. మొత్తం గ్లింప్స్ లో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం. ఇప్పటి వరకూ అతను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన కంపోజిషన్ తో వస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. అంటే మూవీ థీమ్ కు తగ్గట్టుగా కనిపిస్తోంది.

ఇక ఈ గ్లింప్స్ తో పాటు సినిమాను ఈ యేడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు శేష్. శేష్, మృణాల్ ఠాకూర్ తో పాటు ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునిల్, అతుల్ కులకర్ణి, జేన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని షనీల్ డియో డైరెక్ట్ చేస్తున్నాడు.

Tags

Next Story