Dacoit Postpone : డెకాయిట్ పోస్ట్ పోన్.. గూఢచారి 2పై ఎఫెక్ట్

అడివి శేష్ హీరోగా నటిస్తోన్న మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. షనీల్ డియో డైరెక్షన్ చేస్తోన్న ఈ మూవీని సుప్రియ నిర్మిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మొదట శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. తను తప్పుకుంది. తర్వాత మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కారణంగా ఈ మూవీ బాగా లేట్ అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా డెకాయిట్ ను మార్చి 19న విడుదల చేయాలనుకున్నారు. ఆ టైమ్ కు యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీ కూడా ఉంది. అయినా డెకాయిట్ ను పోస్ట్ పోన్ చేయను అన్నాడు శేష్. బట్ అదే రోజున దురంధర్ 2 మూవీ కూడా విడుదల కానుంది. దీంతో ఇలాంటి బిగ్ మూవీస్ మధ్య పోటీ ఎందుకో అనుకున్నారేమో.. డెకాయిట్ ను వాయిదా వేశారు. అయితే ఇదేమంత పెద్ద వాయిదా కాదు. ఏప్రిల్ లోనే విడుదల చేయబోతున్నారు. అన్నీ కుదిరితే ఏప్రిల్ 10నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ పై గూఢచారి 2పై భారీ ప్రభావం పడబోతోంది.
గూఢచారి 2 మే 1న విడుదల చేయాలనుకున్నారు. అంటే డెకాయిట్ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే గూఢచారి 2ను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మొదటి మూవీనే వాయిదా పడుతుంది. అంటే రెండో సినిమాపై పెద్ద ప్రభావం పడబోతోంది అనేది మాత్రం క్లియర్. ఈ రెండు సినిమాలపై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి మూవీస్ విడుదల విషయంలో మాత్రం తేడాగా ఉండబోతున్నాయి. ఒకటి వాయిదా పడుతుందంటే మరోటి కూడా పోస్ట్ పోన్ అవుతున్నట్టుగానే చెప్పాలి. మరి ఈ రెండు మూవీస్ రిలీజ్ డేట్స్ మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే డెకాయిట్ ఏప్రిల్ నుంచి కూడా తప్పుకుంటే మాత్రం గూఢచారి 2 కు ఇంకా సమస్య పెరుగుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
