Suriya-Allari Naresh: ఇద్దరు హీరోల చిత్రాలకు ప్రతిష్టాత్మక అవార్డు..

X
By - Prasanna |4 May 2022 6:30 PM IST
Suriya-Allari Naresh: తమిళ స్టార్ హీరో సూర్య జై భీమ్, అల్లరి నరేశ్ నాంది చిత్రాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు
Suriya-Allari Naresh: తమిళ స్టార్ హీరో సూర్య జై భీమ్, అల్లరి నరేశ్ నాంది చిత్రాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ఈసారి జై భీమ్, నాంది సినిమాలకు అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన ఈ చిత్రానికి ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి.
ఈ చిత్రంలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇక టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాను డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ చిత్రానికిగాను ఆయన బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com