Bigg Boss 5 Telugu: నాగ్ ఔట్.. హోస్ట్‌గా యంగ్ హీరో..!
Telugu Biggboss 5 season : బుల్లితెరపై బిగ్‌బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు నాలుగు సీజన్స్‌ని కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్‌కి ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. . తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడంలేదట.
ఆయన స్థానంలో యంగ్ హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ మూడు, నాలుగు సీజన్స్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగ్.. ఈ సీజన్‌కి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. దీనితో బిగ్‌బాస్ నిర్వాహకులు పలువురు యంగ్ హీరోలను సంప్రదించారట. చివరికి రానాని ఫైనల్ చేశారని తెలుస్తోంది. గతంలో రానా 'నెంబర్ వన్ యారీ'అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్ ని హోస్ట్ చేయనున్నాడని సమాచారం. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు బిగ్‌బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com