Daggubati Venkateswara Rao: బావా.. 'అఖండ' గా అదరగొట్టావు..: దగ్గుబాటి వెంకటేశ్వర రావు

Daggubati Venkateswara Rao: బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. ఈ కాంబినేషన్ పేరు వినగానే మాస్ ఆడియన్స్ హై వోల్టేజ్ ఎనర్జీతో ఉర్రూతలూగిపోతారు. యాక్షన్ మూవీ లవర్స్‌కు ఎలాంటి స్టఫ్ కావాలో.. బోయపాటికి బాగా తెలుసు. అందులోనూ హీరో బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఎలా శాటిస్ఫై చేయాలన్న విషయంలో బోయపాటి స్పెషల్ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది. 'సింహా' నుండి మొదలయిన వీరి కాంబినేషన్ 'అఖండ'తో హ్యాట్రిక్ హిట్‌ను అందుకుంది. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా 'అఖండ' సినిమాపై స్పందించారు.
సినిమా ఫస్ట్ సీన్ మొదలయినప్పుడు నుండి అఖండ.. బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు మాస్ ఆడియన్స్‌కు కూడా ఫీస్ట్‌లాగా నిలిచిపోయింది. అందుకే కలెక్షన్స్ విషయంలో అఖండ.. మిగతా సినిమాలతో పోటీపడి దూసుకుపోతోంది. ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు, ప్రేక్షకులు అఖండ సినిమాపై స్పందించారు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఈ సినిమాపై రియాక్ట్ అవ్వడం నందమూరి కుంటుంబ అభిమానులకు, బాలయ్య ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్. ఇప్పటివరకు ఆయన ఏ సినిమాపై ఇలా రియాక్ట్ అవ్వలేదు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కూడా కాదు. అందుకే అఖండపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
బావ బాలకృష్ణ సినిమాను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు. హిందూత్వం, హిందూతత్వం గురించి అఖండ చిత్రంలో బాగా చెప్పారని ఆయన అన్నారు. గౌతమపుత్ర శాతకర్ణి సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ నటనకు అదే పరాకాష్ట అనుకునేవాడినని అన్నారు. కానీ అఖండలో అంతకు మించిన నటనను కనబరచాడని బాక్సాఫీస్ బొనాంజ ప్రశంసలతో ముంచెత్తారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన కామెంట్‌కు బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com