Daksha Nagarkar : మూడో సినిమాకే క్రేజీ ఆఫర్ కొట్టేసిన జాంబిరెడ్డి బ్యూటీ..!

Daksha Nagarkar : 'హుషారు', 'జాంబిరెడ్డి' చిత్రాలలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది ముంబై బ్యూటీ దక్షా నగార్కర్.. హీరోయిన్ గా అలరించిన దక్షా ఇప్పుడు లేడీ విలన్ పాత్రలో నటించేందుకు రెడీ అయిపొయింది. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.
ఈ క్రమంలో చిత్రయూనిట్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు మేకర్స్.. అందులో భాగంగానే సినిమాలో రవితేజ కోసం ఓ శక్తిమంతమైన లేడీ విలన్ పాత్ర కోసం దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో కథాచర్చలు జరగగా, ఆమెకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. దీనిపైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.
మూడో సినిమాకే ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రకి ఎంపిక కావడం అంటే మాములు విషయం కాదు.. ఈ సినిమాతో ఆమెకి మరింత క్రేజ్ పెరగడం ఖాయమని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com