Balakrishna : సెంచరీ కొట్టిన డాకూ మహారాజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహారాజ్ ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే భారీ అంచనాలున్న మూవీ ఇది. వాటిని అందుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేసిన డాకూ మహారాజ్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాడు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్యకు జోడీగా ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో బాబీ డియోల్ విలన్ గా నటించిన డాకూ మహారాజ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చాడు.
చాలామంది ఈ మూవీలోనూ బాలయ్య డ్యూయొల్ రోల్ చేశాడు అనుకున్నారు. బట్ ఒకే పాత్రతో మూడు రకాల వైవిధ్యాన్ని చూపించాడు దర్శకుడు. ఓ చీఫ్ ఇంజినీర్ డాకూ మహారాజ్ గా ఎందుకు మారాడు అనే నేపథ్యం ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కువమందికి కనెక్ట్ అయింది. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర కీలకంగా కనిపిస్తుంది. అన్నిటికి మించి థమన్ నేపథ్య సంగీతం డాకూను ది బెస్ట్ గా మార్చింది అనడంలో డైటే లేదు. ఇక ఈ వయసులో కూడా బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టిన వైనం ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.
మొదటి నుంచే కలెక్షన్స్ పరంగా దూకుడు చూపిస్తోన్న డాకూ మహారాజ్ కేవలం 4 రోజుల్లోనే వంద కోట్ల మార్క్ ను టచ్ చేసింది. నాలుగు రోజుల్లో 105 కోట్ల వసూళ్లు సాధించిందని మేకర్స్ అఫీషియల్ గానే ప్రకటించారు. దీంతో బాలయ్య మరోసారి సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం మరో వీకెండ్ వచ్చింది. కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలుచాలానే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com