Daku Maharaaj : డాకూ మహరాజ్ గ్రాండ్ రిలీజ్ ఫంక్షన్ రద్దు

Daku Maharaaj  :  డాకూ మహరాజ్ గ్రాండ్ రిలీజ్ ఫంక్షన్ రద్దు
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈమూవీలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందినీ చౌదరి, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బాలయ్య డ్యూయొల్ రోల్ చేశాడు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. డాకూ మహరాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ అనంతపురంలో నిర్వహించాలనుకున్నారు. ఈ ఈవెంట్ కు ఏపి మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అయితే తిరుమల ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడంతో ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

మరణించిన వారి బంధువులంతా విషాదంతో ఉన్న తరుణంలో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భావ్యం కాదు అనే రద్దు చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే తమ బ్యానర్ లో బాలయ్య ఫస్ట్ టైమ్ సినిమా చేశాడు అనే ఆనందంతో ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. బట్ జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకుని రద్దు చేశారు.

ఈవెంట్ రద్దు అయినా సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. బాలకృష్ణ ఈ మూవీలోనూ రెండు పవర్ ఫుల్ పాత్రల్లో అదరగొట్టాడు అంటున్నారు.

Tags

Next Story