Daku Maharaaj : ఆగిన చోటే డాకూ సక్సెస్ సెలబ్రేషన్స్

Daku Maharaaj :  ఆగిన చోటే డాకూ సక్సెస్ సెలబ్రేషన్స్
X

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ డాకూ మహారాజ్. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది.ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య జోడీగా, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలు చేశారు. బాబీ డియోల్ విలన్ గా నటించాడు.ఈ మధ్య బాలయ్య చాలా సినిమాల్లో డ్యూయొల్ రోల్ తో కనిపిస్తున్నాడు. డాకూ మహారాజ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఇందులోనూ డ్యూయొల్ రోల్ అనుకున్నారు. బట్ ఒకే పాత్రతో రెండు డైమన్షన్స్ తో కనిపించాడు. ఓ హానెస్ట్ ఇంజినీర్ చంబల్ ప్రాంతంలో ఉన్న కరడుగట్టిన పెత్తందారులకు ఎదురుతిరిగి డాకూ మహారాజ్ గా వారిని ఎలా అంతం చేశాడు అనే కోణంలో బాలయ్యను కొత్త ప్రజెంట్ చేశాడు దర్బకుడు బాబీ. థమన్ నేపథ్య సంగీతం మరో హైలెట్ గా నిలిచిన ఈ మూవీ అతి తక్కువ టైమ్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది ప్రస్తుతం 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

ఇక ఈ మూవీ సక్సెస్ సంబురాలను ఈ బుధవారం సాయంత్రం అనంతపురంలో నిర్వహించబోతున్నారు.అనంతపురం శివారులోనే శ్రీనగర్ కాలనీ సమీపంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. నిజానికి రిలీజ్ కు ముందు అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు.కానీ ఆ టైమ్ లో తిరుపతిలో తొక్కిసలాట జరిగి 7గురు చనిపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్లేస్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు మేకర్స్.ఈ సక్సెస్ మీట్ కు నందమూరి బాలకృష్ణ,ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వసి రౌతేలా, డైరెక్టర్ బాబి తదితరులు పాల్గొనబోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేవలం పాస్ లు ఉన్నవారినే అనుమతి ఇస్తామని చెబుతున్నారు పోలీస్ లు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags

Next Story