Daku Maharaaj Trailer : రేపే డాకూ మహరాజ్ ట్రైలర్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకూ మహరాజ్. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ చిత్రంపై అంచనాలున్నాయి. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాడు. తాజాగా వచ్చిన దబిడి దిబిడి పాటలోని స్టెప్పులు విపరీతంగా ట్రోల్ అవుతున్నా.. సాంగ్ మాత్రం దూసుకుపోతోంది. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, చాందినీ చౌదరి ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ మూవీలో కూడా బాలయ్య డ్యూయొల్ రోల్ చేశాడు అనే ప్రచారం జరుగుతోంది. అది నిజమా కాదా అనేది ట్రైలర్ వస్తే కాని తేలదు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, జై లవకుశ ఫేమ్ రోనిత్ రాయ్ విలన్స్ గా నటించారు.
ఇక ఈ శనివారం డాకూ మహరాజ్ అమెరికాలోని డల్లాస్ లో హల్చల్ చేయబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ను అక్కడే విడుదల చేయబోతున్నారు. ఓవర్శీస్ అనే పెద్ద మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత.. ఈ మధ్యే మనవాళ్లు అక్కడ ప్రమోషన్స్ పై కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ ఇప్పుడు డాకూ మహరాజ్. అయితే ఈ ట్రైలర్ మన వరకూ రావడానికి టైమ్ పడుతుంది. ఆదివారం ఉదయానికి కానీ తెలుగు ఆడియన్స్ కు రీచ్ కాదు ఈ ట్రైలర్. టెక్నికల్ గా చెబితే..
ఈ శనివారం 9.09 గంటలకు అమెరికాలో రిలీజ్ చేస్తారు. మనకు రేపు ఉదయం 8.39 నుంచి అందుబాటులోకి వస్తుందన్నమాట. అంటే ఆ టైమ్ కు యూ ట్యూబ్ లో అవైలబుల్ ఉంటుంది. సో.. ఒక ట్రైలర్ రెండు రోజుల్లో కనిపించబోతోంది. కాకపోతే ఈ రాత్రికే ఈ వీడియోస్ బయటకు వచ్చేస్తాయి అని వేరే చెప్పక్కర్లేదు.
మొత్తంగా బాలయ్య అనగానే తను కూడా పూనకాలు తెచ్చుకుంటున్నాడు థమన్. అది ఈ డాకూ మహరాజ్ నేపథ్య సంగీతంలోనూ కనిపించబోతోందని ఇప్పటికే చూసిన వారు అభిమానులను ఊరిస్తున్నారు. ఈ నెల 12న విడుదల కాబోతోన్న డాకూ మహరాజ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com