Balakrishna : ఓటిటిలోనూ డాకూ మహారాజ్ దూకుడు

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన సినిమా డాకూ మహారాజ్. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ విలన్ గా బాబీ డియోల్ ఇతర పాత్రల్లో ఊర్వశీ రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, సచిన్ ఖేడ్కర్, షైన్ టామ్ చాకో నటించారు. థమన్ సంగీతం హైలెట్ గా నిలిచిన ఈ మూవీ ఓటిటిలో ఈ నెల 21 నుంచి స్ట్రీమ్ అవుతోంది. నిజానికి ఎప్పుడో ఓటిటికి రావాల్సిన ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఆపేసింది. అయినా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ తో పాటు జియోస్టార్, ప్రైమ్ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోందీ మూవీ.
ఇక డాకూ మహారాజ్ కు థియేటర్స్ లోనే కాక ఓటిటి నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులోనే కాకుండా ఇతర భాషా ప్రేక్షకులు సైతం బాలయ్య నట విశ్వరూపానికి ఫిదా అవుతున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను చంబల్ లోయ బ్యాక్ డ్రాప్ లో చెప్పిన దర్శకుడి ప్రతిభపైనా ప్రశంసలు కురుస్తున్నాయి. బాలయ్య ఇంజినీర్ గా నటించిన ఈ మూవీ ఆయన కెరీర్ కు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా డాకూ మహారాజ్ ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నాడన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com