Balakrishna : తమిళ్, హిందీలోనూ డాకూ మహరాజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ ను సంక్రాంతి బ్లాక్ బస్టర గా డిక్లేర్ చేసి మరీ చెబుతున్నారు విశ్లేషకులు. ముందు నుంచీ ఈ మూవీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ నుంచి ట్రైలర్ వరకూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మామూలుగా బాలయ్య సినిమాలంటే కాస్త లౌడ్ గా ఉంటాయి. బట్ ఈ సారి కామ్ గా ఖతమ్ చేయబోతున్నాడు అని చెబుతున్నాడు నిర్మాత నాగవంశీ. అంటే ఇప్పటి వరకూ అరుస్తూ భారీ డైలాగులు చెబుతూ.. ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తూ వచ్చిన బాలయ్య ఈ సారి కాస్త కూల్ గా, సెటిల్డ్ గా కనిపిస్తూ.. ఓ రేంజ్ హీరోయిజం పండించాడు అనేది నిర్మాత వెర్షన్. నిజానికి బాలయ్యను ఇలా కూడా చూడాలని చాలామంది అనుకుంటున్నారు. అది డాకూ మహరాజ్ తో నెరవేరబోతోంది.
ఇక తెలుగులో ఈ నెల 12న విడుదల కాబోతోన్న డాకూ మహరాజ్ దండయాత్ర టాలీవుడ్ కే కాక కోలీవుడ్, బాలీవుడ్ కూ వెళ్లబోతోంది. అయితే ఆ రెండు భాషల్లో ఈ నెల 17న విడుదల చేస్తారట. అంటే సడెన్ గా తీసుకున్న నిర్ణయం వల్ల డబ్బింగ్ ఆలస్యం అయిందా లేక ముందుగానే ఆ డేట్స్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారా అనేది చెప్పలేం కానీ.. ఇక్కడ మంచి రివ్యూస్ పడితే మాత్రం డాకూ మహరాజ్ ఆ రెండు భాషల్లో కూడా దుమ్మురేపడం ఖాయం. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకు ఈ తరహా టైటిల్స్ తో పాటు కంటెంట్ కూడా బాగా ఇష్టం. సో.. తెలుగు రివ్యూస్ ను బట్టి ఈ మూవీ అక్కడ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో అంచనాకు రావొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com