Daku Maharaj : ఫోటోస్ తోనే కిక్ ఇస్తోన్న బాలయ్య

Daku Maharaj :  ఫోటోస్ తోనే కిక్ ఇస్తోన్న బాలయ్య
X

పాటలు, టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేయడం కామన్ గా చూస్తుంటాం. కానీ పోస్టర్స్ తోనే ప్రేక్షకుల్లోనే అంచనాలు పెంచడం మాత్రం అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకూ మహరాజ్ పోస్టర్స్ చూస్తుంటే అదే ఫీలవుతున్నారు ఆడియన్స్. టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ తోనే ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కాబోతోన్న సినిమా అనే వైబ్స్ వచ్చాయి. బాలయ్య లుక్కు మరింత బాగా కుదిరిందీ సారి. రెగ్యులర్ మూవీలా కాకుండా ఓ కొత్త బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు బాబీ అనే కలర్ మొదటి నుంచి వస్తోంది. దాన్ని డబుల్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతూ కనిపిస్తున్నాయి కొత్త పోస్టర్స్.

మామూలుగా టైటిల్ అనౌన్స్ మెంట్ చూస్తే ఊరమాస్ ఎంటర్టైనర్ అనిపించింది. కాదూ.. క్లాస్ యాంగిల్ కూడా ఉంటుందని.. పాట అప్డేట్ తో ఓ చిన్న పాపతో కనిపించిన ఫోటోస్ వైరల్ గా మారాయి. డాకూ మహరాజ్ కాదు.. ఈయన ముద్దుల మామయ్య అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. చిన్నీ అంటూ సాగే పాటను మరికొన్ని గంటల్లో విడుదల చేయబోతున్నారు. ఈ పాటను బట్టి సినిమా కంటెంట్ పై ఓ ఐడియాకు రావొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. అంత సాఫ్ట్ గా ఉండే హీరో డాకూలా మారడానికి కారణాలే ఈ సినిమా కథగా ఉండబోతోందంటున్నారు.

ఇక ఈ క్లాస్ ఫోటోస్ ను ఆనందిస్తోన్న టైమ్ లోనే జీప్ లో మాస్ మెస్మరైజ్ అయ్యేలా మరో లుక్ వచ్చింది. ఏదేమైనా డాకూ మహరాజ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి మేం రీచ్ అవుతున్నాం అనే హింట్ ఇస్తున్నట్టుగా ఉన్నాయీ పోస్టర్స్. మరి పోస్టర్స్ కే ఈ రేంజ్ హైప్ అంటే ఇంక ట్రైలర్ కూడా వచ్చేస్తే ఇంకే రేంజ్ లో ఉంటుందో.

Tags

Next Story