Danger Pilla Song : సూపర్ మెలోడీతో మైమరిపించిన నితిన్, శ్రీలీల

టాలెంటెడ్ యాక్టర్ నితిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’కు రైటర్ – డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం. ఇదిలా ఉండలా మేకర్స్ ముందే చెప్పినట్టే.. ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మ్యూజికల్ జీనియస్ హారీస్ జైరాజ్ మరోసారి తన టాలెంట్ ను ‘డేంజర్ పిల్ల..’ సాంగ్‌తో బయటపెట్టాడు. వండర్‌ఫుల్ ఫుట్ ట్యాపింగ్ బీట్‌ను అందించారు. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. కాగా ఈ సినిమాలో నితిన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారనే టాక్ వినిపిస్తోంది. క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ తర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో సినిమా మెప్పించనుంది’’ అని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.
Experience the magic of #DangerPilla Lyrical Song from #Extra-Ordinary Man ❤️#ExtraOrdinaryMan Releasing on 23rd Dec 2023💥
— nithiin (@actor_nithiin) August 2, 2023
A @Jharrisjayaraj Musical 🎶https://t.co/ioPGMjI7mJ@actor_nithiin @sreeleela14 @vamsivakkantham @ArmaanMalik22 @kk_lyricist #SudhakarReddy… pic.twitter.com/PVtqMWTbwG
ఇక తాజాగా విడుదలైన పాట విషయానికొస్తే..
''అరే బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా...
చీకట్లో తిరగని మిణుగురు తళుకువా...
ఒక్క ముల్లు కూడా లేనే లేని రోజు పువ్వా...
రేరు పీసే నువ్వా!
కలలు కనదట...
కన్నెత్తి కనదట...
కరుకు మగువట... హొయ్!
నగలు బరువట...
గుణమే నిధి అట...
ఎగిరి పడదట... హొయ్!
డేంజర్ పిల్లా... (2)
డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా''
అంటూ కృష్ణకాంత్ (కేకే) రాశారు. సాంగ్ వింటుంటే వెంటనే ఎక్కేసే సూపర్ మెలోడీలా అనిపిస్తోంది. మొత్తానికి ఈ సాంగ్ ప్రేక్షకులను బాగానే అలరించనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా.. 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్' విడుదల తేదీని కూడా వెల్లడించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. కానీ ఈ సినిమాను మాత్రం శనివారం విడుదల చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com