Danger Pilla Song : 'డేంజర్ పిల్ల'తో ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' నితిన్

Danger Pilla Song : డేంజర్ పిల్లతో ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్నఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్ నితిన్
ఆగస్టు 2 రిలీజ్ కానున్న నితిన్ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' ఫస్ట్ సాంగ్

హీరో నితిన్ కథానాయకుడిగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎక్స్‌ట్రా' ఆర్డినరీ మ్యాన్... అనేది ఉపశీర్షిక. నితిన్ 32వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆగస్టు 2న 'డేంజర్ పిల్ల

'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమాలోని మొదటి పాటగా 'డేంజర్ పిల్ల'ను మేకర్స్ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. కొంత విరామం తర్వాత ఆయన పని చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. హ్యారిస్ అంటే మెలోడీలకు ఫేమస్. అదే తరహాలో ఈ డేంజర్ పిల్ల సాంగ్ ను మంచి మెలోడీగా రూపొందించినట్టు చిత్ర బృందం తెలిపింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ లో నితిన్ రెండు గెటప్పుల్లో కనిపించారు. కింద కూర్చున్న లుక్కులో మాంచి స్టైలిష్ గా కనపడితే... పైన లుక్కులో గుబురు గడ్డంతో కనిపించారు. ఆ రెండు లుక్కులో ఏది ఎక్స్ట్రా, ఏది ఆర్డినరీ అనేది చూడాలి. ఇక ఈ ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటే ఈ సినిమా రిలీజ్ పైనా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. మామూలుగా అయితే చాలా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను మాత్రం శనివారం విడుదలవుతోంది. క్రిస్మస్ 25న కనుక కనుక సెలవులు ఉంటాయి. ఓపెనింగ్స్ విషయంలో ఢోకా అవసరం లేదు.

ఇదిలా ఉండగా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తి అయ్యిందని చిత్ర నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ప్ర‌స్తుతం చిత్రీక‌రణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందన్నారు. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందని అభిమానులు చెప్పడం సంతోషంగా ఉందని, ఫ్యాన్స్ లుక్ ఎక్సట్రాడినరీగా ఉందన్నారని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story