Narne Nithin : కుర్రాళ్లు నలిగిపోయేలా ఉన్నారండీ.. ఆయ్..
టాప్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే.. ఆ టైమ్ లోనే టైర్ టూ హీరోలు రావడానికి భయపడతారు. అలాగే ఈ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చిన్న హీరోలు రావడానికి కూడా భయపడతారు. అయినా వీళ్లు భయడపటం లేదు. ఈ పోటీలో మేం నెగ్గుతాం అండీ ఆయ్ అంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ బావమరిదిగా ఎంటర్ అయిన నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందిన సినిమానే ఆయ్. అంకిత్ కొయ్య, మైమ్ గోపి, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటించారు. అంజి కాంచిపల్లి డైరెక్ట్ చేశాడు. బననీ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. అప్పుడు రేస్ లో డబుల్ ఇస్మార్ట్ మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు సీన్ మారింది.
ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ తో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ మూవీస్ వస్తున్నాయి. దీంతో ఆయ్ పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు చాలామంది. బట్ బన్నీ వాసు తగ్గేదే లే అంటూ ముందుకే దూకాడు. అదే రోజు తమ సినిమాను విడుదల చేస్తాం అని స్ట్రాంగ్ గా ఉన్నాడు. అయితే ఈ మూవీకి బన్నీ వాసు తప్ప మరో స్పెషల్ అట్రాక్షన్ లేదు. అంటే పోస్టర్ వాల్యూ కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ కు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వస్తారు అనే ప్రచారం జరిగింది. బట్ వాళ్లు రావడం లేదు. నిఖిల్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకువస్తున్నారు.
కానీ ఇప్పుడున్న ఊపు చూస్తోంటే ఆయ్ అనే మూవీ ఆగస్ట్ 15న విడుదలవుతున్నట్టు కూడా చాలామందికి తెలియదు. అటు చూస్తే డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ ప్రమోషన్స్ తో దూకుడుగా ఉన్నాయి. అందుకే ఈ మూడు సినిమాల మధ్య కుర్రాళ్లు నలిగిపోతారేమో అంటున్నారు. అయినా బలమైన కంటెంట్ ఉంటే తర్వాతైనా పికప్ అవుతారు. బట్ అసలంటూ మౌత్ టాక్ రావాలంటే ముందు ఓపెనింగ్స్ ఉండాలి కదా..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com