Darling Movie : ఇలాంటి కాన్సెప్ట్స్ జనానికి ఎక్కుతాయా 'డార్లింగ్'

Darling Movie : ఇలాంటి కాన్సెప్ట్స్ జనానికి ఎక్కుతాయా డార్లింగ్
X
ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ మూవీ జనానికి కనెక్ట్ అవుతుందా..? అపరిచితుడు కాన్సెప్ట్ ఆడియన్స్ కు నచ్చుతుందా..

ఏదైనా సూపర్ హిట్ మూవీలోని యూనిక్ పాయింట్ ను ఇతర హీరోలు లేదా కమెడియన్స్ స్పూఫ్ చేస్తే కొంత వరకూ నచ్చే అవకాశం ఉంది. అలా కాదని ఆ పాయింట్ తోనే మరో సినిమా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పెద్ద ఆసక్తి కనిపించదు. ప్రస్తుతం ‘డార్లింగ్’ అనే సినిమా పరిస్థితి ఇదే. కమెడియన్ గానూ, హీరోగానూ మంచి విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. నభాకు ఇది ఓ రకంగా లిట్మస్ టెస్ట్ లాంటి సినిమా. ఆ మధ్య యాక్సిడెంట్ జరిగి యేడాదికి పైగా వెండితెరకు దూరంగా ఉంది. మళ్లీ ఆఫర్స్ అందుకునేందుకు అనేక తంటాలు పడింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫైనల్ గా రెండు మూడు ఛాన్స్ లు వచ్చాయి. అందులో మొదటగా వస్తోన్న మూవీ ‘డార్లింగ్’ ఈ నెల 19న విడుదల కాబోతోంది.

డార్లింగ్ మూవీ ట్రైలర్ చూస్తే ఏమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అనేది చాలామంది చెబుతోన్న మాట. కొన్నేళ్ల క్రితం డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు అనే సినిమాలో మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి కారణంగా హీరో రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు. అదే పాయింట్ ను ఇక్కడ హీరోయిన్ కోణంలో కామెడీగా చెప్పాం అని మేకర్స్ చెబుతున్నారు. బట్ ట్రైలర్ చూస్తే ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా లేదు. నటన పరంగా ఇద్దరూ ప్రతిభావంతులే.కానీ కంటెంట్ చూస్తేనే అవుట్ డేటెడ్ లా కనిపిస్తోంది. ఈ మధ్య భార్య, భర్తల నేపథ్యంలో అనేక సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నే ఆకట్టుకుంటున్నాయి. లవర్స్ నుంచి కపుల్ గా మారిన ఓ జంటలో అమ్మాయికి అపరిచితురాలు లాంటి వ్యాధి ఉంటే అతను పడే ఇబ్బందులేంటీ అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే అయినా.. సినిమా ఆసాంతం అదే పాయింట్ తో నెట్టుకురావడం బోరింగ్ పాయింట్ అవుతుంది. మరి ఈ పాయింట్ ను దాటి ఇంకేదైనా కొత్తదనం ఉంటే తప్ప ఈ డార్లింగ్ మూవీ జనాలకు నచ్చదు. అసలే ఈ మధ్య ఏ మాత్రం బాలేదు అన్న టాక్ వచ్చినా.. జనం ఆ వైపే చూడ్డం లేదు.

Tags

Next Story