Darshan : అభిమాని హత్య కేస్ లో దర్శన్ కు కండీషనల్ బెయిల్
కన్నడ నాట సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేస్ లో ప్రధాన ముద్దాయిగా ఉన్న అక్కడి టాప్ హీరో దర్శన్ కు ఫైనల్ గా బెయిల్ వచ్చింది. దర్శన్ అభిమాన సంఘంలో యాక్టివ్ గా ఉండే రేణుకా స్వామి.. అతను పవిత్ర గౌడతో అక్రమ సంబంధం పెట్టుకోవడం సహించలేదు. దీంతో పవిత్ర గౌడకు కొన్ని అసభ్య కరమైన మెసేజ్ లు పెట్టాడనే కారణంగా తో దర్శన్, పవిత్రల సమక్షంలోనే తన మూకతో కలిసి అత్యంత దారుణంగా హింసించి రేణుకా స్వామిని చంపేసి పక్కనే ఉన్న మురుగు కాల్వలో శవాన్ని పడేశారు. ఆ కేస్ లో అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత దర్శన్, పవిత్రలను ఏ 1, ఏ 2లుగా చేరుస్తూ.. వీరితో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేసి బెంగళూరు జైలుకు పంపించారు. అప్పటి నుంచి దర్శన్ చాలాసార్లు బెయిల్ కోసం అప్లై చేసినా కోర్ట్ నిరాకరించింది. అదే టైమ్ లో బెంగళూరు జైలులో అతనికి రాయల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారనే విషయంలో వెలుగులోకి రావడంతో జైలు సూపర్ డెంట్ తో పాటు 6గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అక్కడి నుంచి దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించారు.
ఇక కొన్ని రోజులుగా తను తీవ్రమై బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నానని.. దీని కారణంగా ఒక కాలు విపరీతంగా ఇబ్బంది పెడుతోందనే కారణంతో బెయిల్ కు అప్లై చేసుకున్నాడు దర్శన్. కానీ ఆ అభ్యర్ధనను వెంటనే ఒప్పుకోలేదు కోర్ట్. నిజంగా బ్యాక్ పెయిన్ ఉందా లేదా అని పరీక్షలు జరిపిన అనంతరం ఆ రిపోర్ట్ లను పరిశీలించి.. తాజాగా ఆరు వారాల పాటు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ బెయిల్ కాలంలో దర్శన్ పాస్ పోర్ట్ ను సీజ్ చేసింది. అతనికి ఇష్టమైన హాస్పిటల్ లో చికిత్స చేయించుకునే వెసులు బాటు ఇచ్చింది. అదే సమయంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాడు అనేది 7 రోజుల్లోగా కోర్ట్ కు ఆధారాలతో సమర్పించాలని చెప్పింది. ఈ ఆరు వారాల ట్రీట్మెంట్ కు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ ను బెయిల్ గడువు తీరిన తర్వాత కోర్ట్ కు సమర్పించాలని కూడా ఆదేశించింది. ఫైనల్ గా దర్శన్ కు బెయిల్ రావడంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com