Puri Jagannadh : పూరీ నిరీక్షణకు తెర దించేదెవరు..?

ఒకప్పుడు డాషింగ్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. ఆ టైమ్ లో ప్రతి స్టార్ హీరో ఒక్కసారైనా పూరీ డైరెక్షన్ లో నటించాలని కలలు కన్నారు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు.. ఒక దశలో ట్రాక్ తప్పాడు. మళ్లీ ట్రాక్ ఎక్కలేదు. మధ్యలో హిట్ అనిపించుకున్న ఇస్మార్ట్ శంకర్ కూడా అదే రొడ్డకొట్టుడు కంటెంట్ తో కనిపిస్తుంది. కాకపోతే ఆ టైమ్ లో మన దగ్గర కాస్త ఎక్కువ సెన్సిబుల్ మూవీస్ వస్తున్నాయి. దీంతో సడెన్ గా వచ్చిన ఈ మాస్ మూవీ హిట్ అయింది. బట్ అదే టెంప్లేట్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మాత్రం డిజాస్టర్ అయింది. ఇక విజయ్ దేవరకొండతో ప్యాన్ ఇండియా రేంజ్ లో హడావిడీ చేసి తీసిన లైగర్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ పూర్తిగా ఖాళీ అయిపోయాడు. పైగా ప్రొడక్షన్ కూడా చేయడంతో డబుల్ లాస్ అయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ హీరో కోసం ఎదురుచూస్తున్నాడు.
మామూలుగా అయితే అతను కథలు సిద్ధం చేసుకుని హీరోలను అప్రోచ్ కావాలి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే చాలామంది హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొన్ని రోజులు అఖిల్ తో సినిమా అన్నారు. అంతకు ముందు గోపీచంద్ తో గోలీమార్ సీక్వెల్ అన్నారు. ఇవేవీ నిజం కాదు. తాజాగా నాగార్జునతో సినిమా అంటున్నారు. బట్ ఇలా సడెన్ గా ఏదైనా హీరో డేట్స్ ఇస్తా అన్నా అతనికి తగ్గ కథ ఇతని వద్ద ఉండాలి. లేదంటే హీరోల డేట్స్ ఉన్నాయని ఏదో ఒకటి వండేస్తే.. మళ్లీ అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది.
నిజానికి పూరీ గొప్ప కథకుడు. కథనంతోనూ మాయ చేస్తాడు. కానీ ఆ టచ్ కోల్పోయాడు. ఇది మణిరత్నం లాంటి లెజెండ్స్ కే తప్పలేదు. ఇండస్ట్రీలో ఎవరికైనా కామన్. అతని తరంలోనే వచ్చిన వివి వినాయక్, శ్రీను వైట్ల ఇదే సిట్యుయేషన్ లో ఉన్నారు. ఈ దర్శకులు ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వాళ్లే. బట్ ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ లు మారాయి. ఇంటర్నేషనల్ మూవీస్ ను ఈజీగా చూస్తున్నారు. అందుకే ఆ స్టాండర్డ్స్ లో మన మూవీస్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన కథలు లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా పట్టించుకోవడం లేదు.
సో.. ఇప్పుడు పూరీకి ముందు హీరో కావాలి. తర్వాత అతనికి తగ్గ కథ ఇతను మనసు పెడితే పెద్ద కష్టమేం కాదు. కానీ పూరీ మనసు పెట్టడం లేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇన్ని ఎదురు దెబ్బల తర్వాత మళ్లీ అదే మాఫియా, హీరోయిన్లను డీ గ్రేడ్ చేసి చూపించడం, ఎక్స్ పోజింగ్, ఐటమ్ సాంగ్స్ ను నమ్ముకోవడం.. ముందు పూరీ కూరుకుపోయిన ఈ ఊబి నుంచి బయటకు రావాలి. తను మాత్రమే చెప్పగలిగే కథలేమైనా ఉంటే వాటితోనే ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మరింత కాలం మనుగడ ఉంటుంది. లేదంటే ఈ నిరీక్షణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేసే హీరో ఎవరో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com