Acharya pre-release event : మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

Acharya pre-release event : RRR, KGF2 చిత్రాల తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ ఆచార్య.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ చరణ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు మేకర్స్.. ఈ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.
చూస్తుంటే చీఫ్ గెస్ట్ లేకుండానే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. అలా అయితే ఇది మెగా అభిమానులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
The stage is set for the MEGA SPECTACLE 🔥#AcharyaPreReleaseEvent on April 23rd from 6 PM 💥💥#AcharyaOnApr29
— Konidela Pro Company (@KonidelaPro) April 21, 2022
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/ZEkA4t0Cxb
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com