Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డేట్ ఫిక్స్

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తారు. బట్ బాలకృష్ణ తనయుడు ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఓ ఎమోషన్ తో చూస్తున్నారు ఫ్యాన్స్. మోక్షజ్ఞని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కాకపోతే అనుకున్న దానికంటే చాల ఆలస్యంగా తనయుడిని పరిచయం చేయబోతున్నాడు బాలయ్య. రీసెంట్ గా అతని మేకోవర్ చూసిన ఫ్యాన్స్ కు మతిపోయింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో సాలిడ్ మాస్ స్టార్ వస్తున్నాడు అని ఫీలయ్యారు. ఇంట్లోవాళ్లూ.. అభిమానులు.. మోక్షూ అని ముద్దుగా పిలుచుకునే ఈ యంగ్ స్టర్.. ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేశారు.
అతి తక్కువ టైమ్ లోనే ప్యాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరంగేట్రం చేయబోతున్నాడు మోక్షజ్ఞ. ఇదో ఫాంటసీ, ఫిక్షన్ మిక్స్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఈ కథ విషయంలో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్ చేశాడు బాలయ్య. ఈ పాత్రకు సంబంధించి బాడీ లాంగ్వేజ్, డిక్షన్ తో పాటు ఇతర విషయాలపై అవగాహన కోసం కొన్నాళ్లుగా సత్యానంద్ వద్ద శిక్షణ కూడా తీసుకుంటున్నాడు మోక్షజ్ఞ. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 6న ప్రారంభించబోతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మాత అంటున్నారు. మర నిర్మాత కూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా బాలయ్య వారసుడి ఆగమనం అభిమానుల్లో ఓ కొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తుందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com